News January 5, 2025
తూప్రాన్: మహిళను చంపిన వ్యక్తి అరెస్ట్
ఓ మహిళను నమ్మించి సహజీవనం చేస్తూ చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూప్రాన్ సీఐ రామకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. బిహార్‌కు చెందిన సూరజ్ కుమార్ చంద్ర వంశీకి రజిని దేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వారు కొన్ని రోజులుగా కలిసే ఉంటున్నారు. ఈక్రమంలో వారి మద్య డబ్బుల విషయంలో తరచూ గొడవ జరగుతుండగా, రజినిని చంపినట్టు ఎస్ఐ తెలిపారు.
Similar News
News January 6, 2025
మెదక్: తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన కలెక్టర్
భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాలు, సూచనల ప్రకారం ప్రత్యేక సవరణ-2025లో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో తుది ఓటర్ల జాబితాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం విడుదల చేశారు. 34-మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 278 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 1,04,917 మంది పురుషులు, 1,15,987 మంది మహిళలు, 4 థర్డ్ జెండర్‌లు కలిపి మొత్తం 2,20,908 సాధారణ ఓటర్లు ఉన్నారు.
News January 6, 2025
సిద్దిపేట: యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు
యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం.. సిద్దిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి చిన్నకోడూరు వాసి చెందిన నిఖిల్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి 2 సార్లు గర్భవతి కాగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ఆమె నగ్నచిత్రాలు ఉన్నాయని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. నిఖిల్‌కు మరో యువతితో నిశ్చితార్థం అవ్వడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News January 6, 2025
మెదక్: స్థానిక పోరుకు సన్నద్ధం..!
ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.