News August 31, 2025
తూప్రాన్: రూ.4.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన

తూప్రాన్ పట్టణ పరిధి ఆబోతుపల్లి శివారులో హల్దీ వాగుపై నూతనంగా రూ.4.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్టు తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. హల్దీ వాగుపై నిర్మించిన కాజ్ వే వరదలకు కొట్టుకుపోవడంతో ఆదివారం ఆయన పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కాజ్ వే దెబ్బ తినడంతో రాకపోకలకు అవకాశం లేదన్నారు.
Similar News
News August 31, 2025
మహిళల, బాలికల భద్రత కోసమే షీ టీమ్స్: ఎస్పీ

ఆగస్టులో షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో భాగంగా మెదక్ డివిజన్‌లో ఈవ్‌టీజర్స్‌పై 2 ఎఫ్ఐఆర్‌లు, 14 ఈ-పెట్టీ కేసులు, తూప్రాన్ డివిజన్‌లో 4 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్‌లు, 18 కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
News August 31, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి

కలెక్టరేట్‌లో రేపు సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.
News August 31, 2025
జిల్లాలో భారీ నష్టం: మెదక్ కలెక్టర్

పకృతి విలయతాండవంతో జిల్లాలో భారీ నష్టం సంభవించినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నిజాంపేట్ మండలంలో వరదలతో కోతకు గురైన వంతెనలు రోడ్లను పరిశీలించారు. 11 మండలాల్లో వర్షాల వరదలతో నష్టాలు కలగాయని, రెండు మండలాల్లో 300 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం, వరదల ప్రవాహంతో భారీ నష్టం సంభవించినట్లు వివరించారు. 130 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించినట్టు వివరించారు.