News October 24, 2024

తూప్రాన్: స్టడీ హాల్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

image

తూప్రాన్ పట్టణ శివారులోని టోల్ ప్లాజా వద్ద గల తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐటీసీ కంపెనీ వారు కట్టిన స్టడీ హాల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ వారు రూ.25 లక్షలతో స్వయంగా స్టడీ హాల్ నిర్మించడం సంతోషకరం అన్నారు. పరిశ్రమల సహాయంతో పాఠశాలలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 9, 2026

మెదక్: సైలెన్స్ పీరియడ్ ప్రచారం వద్దు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉండరాదని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు.

News February 9, 2026

మెదక్: పోలింగ్ రోజు సెలవు: కలెక్టర్

image

ఈ నెల 11న జరగనున్న మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపులు, ఫ్యాక్టరీల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని ఆదేశించారు. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 9, 2026

మెదక్: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి: కలెక్టర్

image

మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఉ.7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిశ్శబ్ద కాలం (Silent Period) అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు.