News September 12, 2025
తూర్పుగోదావరి కలెక్టర్‌గా నర్సీపట్నం యువతి

నర్సీపట్నానికి చెందిన యువతి చేకూరి కీర్తి తూర్పుగోదావరి కలెక్టర్ అయ్యారు. ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీర్తిని కలెక్టర్‌గా తూర్పుగోదావరికి బదిలీ చేసింది. ఆమె చెన్నైలో ఐఐటీ చేసి ఐఆర్ఎస్ రాసి మొదటగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆ తర్వాత ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఐఏఎస్ హోదాలో వివిధ జిల్లాలో పనిచేసిన ఆమె తూర్పుగోదావరి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News September 12, 2025
నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.
News September 12, 2025
రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు: జయప్రకాశ్ నారాయణ

AP: రాజకీయాన్ని తిట్టడం మనల్ని మనం అవమానించుకోవడమే అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ‘నిజాయితీ గల, దాపరికాలులేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వే2న్యూస్‌కు అభినందనలు. రాజకీయ నాయకులపై బురద చల్లడం, తిట్టడం చేస్తాం. కానీ కనిపిస్తే వంగి దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు’ అని తెలిపారు.
News September 12, 2025
రాష్ట్రంలో 4,687 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక విధివిధానాలు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ల తర్వాత ₹11,500 అందుకోనున్నారు.