News October 21, 2025
తూర్పుగోదావరి జిల్లా నుంచి తొలి ఐపీఎస్ ఆయనే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన పీవీ రంగయ్య నాయుడు జిల్లా నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 21 ఏళ్లకే ఆయన ఐపీఎస్ కావడం గమనార్హం. డీజీపీగా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన సేవలు అందించారు. సర్వీస్ అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర విద్యుత్, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.
Similar News
News October 21, 2025
ఏపీ, టీజీ న్యూస్ రౌండప్

* మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి: TG సీఎం రేవంత్
* నవంబర్ 7న ఏపీ క్యాబినెట్ భేటీ
* ఖైరతాబాద్, శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
* నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి: రోజా
* హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 70 మందికి గాయాలు
News October 21, 2025
ఈ నెలాఖరులోగా వాహన పన్ను కట్టాలి: DTO

డా. బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాహనదారులు అక్టోబరు 31 లోగా త్రైమాసిక పన్నుతో పాటు పెండింగ్ అపరాధ రుసుము చెల్లించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన అమలాపురంలో మాట్లాడారు. ఇప్పటికే వాహనదారులకు నోటీసులు పంపామన్నారు. ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో చెల్లించకపోతే, మోటారు వాహనాల చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని డీటీఓ హెచ్చరించారు.
News October 21, 2025
కొడంగల్: ‘THANK YOU’ సీఎం సార్

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హరే కృష్ణ మూమెంట్ సొసైటీ ఉదయం అల్పాహారం అందిస్తుంది. ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, పూరి, మైసూర్ బోండా, ఉప్మాతో పాటు మంగళవారం నుంచి కొత్తగా సెట్ దోసెను ప్రవేశపెట్టారు. అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల హాజరుశాతం మెరుగైందని MEO రామ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ‘ THANK YOU ‘సీఎం సార్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.