News December 19, 2025
తూర్పుగోదావరి పోలీసులకు ‘ABCD’ అవార్డు

ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ‘అవార్డ్ ఫర్ బెస్ట్ఇన్ క్రైమ్ డిటెక్షన్(ABCD)’పురస్కారాన్ని జిల్లా పోలీసు విభాగం దక్కించుకుంది. కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈగౌరవం దక్కింది. ముఖ్యంగా కొవ్వూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్లిష్టమైన హత్యకేసును చాకచక్యంగా ఛేదించిన తీరును ప్రభుత్వం గుర్తించింది. మంగళగిరిలో శుక్రవారం DGP చేతులమీదుగా SP నరసింహకిషోర్ అవార్డును అందుకున్నారు.
Similar News
News December 19, 2025
గన్ని కృష్ణకు పీజీ పట్టా అందించిన మంత్రి లోకేశ్

ఏడు పదుల వయసులో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పట్టాను అందజేశారు. శుక్రవారం రాజమండ్రిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమావేశంలో గన్ని కృష్ణను లోకేష్ అభినందించారు. ఈ వయసులో చదివి పట్టా సాధించడం నేటి యువతకు ఆదర్శవంతమన్నారు. విద్య ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని లోకేశ్ పేర్కొన్నారు.
News December 19, 2025
విరాళాల సేకరణలో తూ.గో జిల్లాకు 3వ స్థానం

సాయుధ దళాల జెండా దినోత్సవం(2024-25) సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జెండా విక్రయాలు, హుండీలు, విరాళాల ద్వారా మొత్తం రూ.12,73,105 నిధులు సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ సేకరణతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మూడవ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. సైనికుల సంక్షేమం కోసం విరాళాలు అందించిన దాతలను ఆమె అభినందించారు.
News December 19, 2025
రేపు పెరవలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఉదయం 9:20 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:50 గంటలకు పెరవలి చేరుకుంటారు. రూ.3,040 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి మంగళగిరి బయలుదేరుతారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.


