News December 24, 2025

తూ.గో: ఆ పదవి అంటేనే భయం.. భయం

image

అన్నవరం సత్యదేవుని ఆలయం వివాదాలకు నిలయంగా మారుతోంది. దీంతో ఇక్కడ పనిచేసేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. తాజాగా ఆర్జేసీ త్రినాధరావును ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమించారు. అయితే వ్రత పురోహితుల చేతివాటం తట్టుకోలేక.. బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. పురోహితుల తీరుతో ఆలయ వ్యవస్థ దెబ్బతింటోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Similar News

News December 25, 2025

CM చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మి

image

సీఎం చంద్రబాబును విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కృష్ణయ్య దంపతులు బుధవారం మర్యాదపూర్వంగా కలిశారు. పనబాక లక్ష్మిని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమించిన సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని పనబాక దంపతులు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం సూచించారు.

News December 25, 2025

SSCలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

image

SSCలో 326 గ్రేడ్-C స్టెనో‌గ్రాఫర్(LDCE) ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, హిందీ/ఇంగ్లిష్‌లో షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. CBTలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు స్టెనో‌గ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చే నెల 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు, అర్హత, అప్లికేషన్, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 25, 2025

నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు

image

జిల్లా సంసద్ ఖేల్ మహోత్సవ్-2025 ముగింపు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆనం కళాకేంద్రంలో మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, మారథాన్ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.