News April 8, 2024

తూ.గో: ఇప్పటివరకు 672 మంది వాలంటీర్ల రాజీనామా

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 672 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం కొత్తపేట మండలం మోడెకూరు గ్రామ సచివాలయం-1, 2కు చెందిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వారి రిజైన్ లెటర్స్‌ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. 

Similar News

News October 4, 2025

రాజమండ్రి : అక్టోబర్ 15 ‘NMMS’ పరీక్ష దరఖాస్తుకు తుది గడువు

image

డిసెంబర్ 7న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో కె. వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15 తుది గడువుగా పేర్కొన్నారు. పరీక్ష రుసుం చెల్లింపునకు 16వ తేదీ, సంబంధిత పత్రాలతో 18వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి సమర్పించాలన్నారు.

News October 4, 2025

బాణాసంచా గోడౌన్లను తనిఖీ చేసిన జేసీ మేఘ స్వరూప్

image

దీపావళి బాణాసంచా తయారీ, అమ్మకాలకు సంబంధించి కచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలని జేసీ మేఘ స్వరూప్ స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో కలిసి ఇటీవల దరఖాస్తు చేసుకున్న బాణాసంచా గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. గోదాముల వద్ద భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. భద్రత ప్రమాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మెరికమ్మ, ఇతర అధికారుల ఆయన వెంట ఉన్నారు.

News October 3, 2025

కొవ్వూరు: ‘గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి’

image

కొవ్వూరు మండలంలో గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా గృహ నిర్మాణాధికారి బుజ్జి శుక్రవారం సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ ఆఫీస్‌లో నియోజకవర్గంలోని హౌసింగ్ అధికారులతో నిర్మాణాలను దశలవారీగా చర్చించారు. త్వరలో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను సామూహిక గృహప్రవేశాలు చేయనందున నిర్మాణ పనులు వేగ వంతం చేయాలని ఆదేశించారు. ఈఈ సీహెచ్ వేణుగోపాలస్వామి, డీఈఈ శేఖర్ బాబు, ఏఈలు పాల్గొన్నారు.