News April 20, 2024

తూ.గో.: ఈ పెళ్లి పత్రిక DIFFERENT.. ఏంటో చూసేయండి

image

రాజమండ్రికి చెందిన అలికాని సత్యశివకుమార్, దుర్గాభవానీల వివాహం ఈ నెల 21న జరగనుంది. కాగా వారి వివాహ వేడుకకు ఆహ్వానపత్రికను వినూత్నంగా సిద్ధం చేశారు. నిశ్చితార్థం మొదలుకొని 16 రోజుల పండగ వరకు సుమారు 45 ఘట్టాలు, వాటి విశిష్టతను 40 పేజీల శుభలేఖలో పొందుపరిచారు. పత్రి ఘట్టానికి ఓ క్యూఆర్ కోడ్ రూపొందించి శుభలేఖలో ముద్రణ చేయించారు. కోడ్ స్కాన్ చేస్తే ఆ ఘట్టాన్ని ఎవరైనా చూడొచ్చు.
– మీరు చూశారా ఇలాంటివి.

Similar News

News October 9, 2025

రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌కు కలెక్టర్ స్వాగతం

image

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.

తూ.గో జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు

image

ఏపీ ఎన్జీవో సంఘం తూర్పుగోదావరి జిల్లాఅడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి రోటరీ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సమావేశంలోఅడహాక్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కో ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, కన్వీనర్‌గా అనిల్ కుమార్, ఆర్థిక సభ్యుడిగా సత్యనారాయణ రాజు, సభ్యులుగా వెంకటేశ్వరరావు, నందీశ్వరుడు, ఎస్ వెంకటరమణ ఎన్నికయ్యారు.