News April 16, 2025
తూ.గో: ఉమ్మడి జిల్లాలో 202 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 202 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 127 SGT(ప్రాథమిక స్థాయి), 75 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News September 16, 2025
ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

సిరికొండ మండలం బీంపూర్‌కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News September 16, 2025
నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్‌లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్ వెరిఫికేషన్ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.
News September 16, 2025
JGTL: ఎస్‌ఐఆర్ నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఎస్‌ఐఆర్ నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 2002 ఎస్‌ఐఆర్, 2025 ఎస్‌ఎస్‌ఆర్ డేటాను పోల్చి డూప్లికేట్ ఓట్లు తొలగించి క్షేత్ర స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో రెగ్యులర్ మీటింగులు జరిపి ప్రతిరోజు లక్ష్యాలు నిర్దేశించాలని VCలో చెప్పారు. VCలో కలెక్టర్ బీ.సత్యప్రసాద్ సహా అధికారులు పాల్గొన్నారు.