News March 3, 2025
తూ.గో: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్

ఏలూరు సర్‌సీఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. విధులకు హాజరయ్యే సిబ్బందితో కాలేజీ రోడ్ అంతా సందడిగా నెలకొంది. లెక్కింపు ప్రక్రియకు 700 మంది సిబ్బందితో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప శివ కిశోర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
Similar News
News September 15, 2025
సంగారెడ్డి జిల్లాలో గేమ్స్ వాయిదా

సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 16, 17న జరగాల్సిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను వాయిదా వేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పోటీలు నిర్వహించాల్సిన మైదానాలు వర్షం నీటితో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 15, 2025
MHBD: ఘోరం.. యూరియా కోసం వెళ్లి మృత్యుఒడికి

యూరియా కోసం వెళ్లిన ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బొద్దుగొండకు యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా గూడూరు మండలంలో జగన్ నాయకులగూడెం వద్ద వేగంగా వచ్చిన బోలెరో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దారావత్ వీరన్న, బానోత్ లాల్య అనే ఇద్దరు రైతులు మృతి చెందారు. ఇంటికి యూరియా బస్తా తెస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబాలకు ఇది తీరని విషాదాన్ని మిగిల్చింది.
News September 15, 2025
మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మిగతా ఇద్దరు చంచల్, జహల్‌పై తలో రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.