News May 12, 2024
తూ.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

ఉమ్మడి తూ.గోలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. అనపర్తి-87.4, రాజానగరం-87.4, రామచంద్రపురం-87.1, మండపేట-86.9, జగ్గంపేట-85.6, కొత్తపేట-84.4, ముమ్మిడివరం-83.6, తుని-83.2, అమలాపురం-83.1, గన్నవరం- 82.4, పత్తిపాడు-81.3, పిఠాపురం-81.2, పెద్దాపురం-80.6, రాజోలు- 80, రంపచోడవరం-77.4. రాజమండ్రి రూరల్-74.2, కాకినాడ రూరల్-74, కాకినాడ సిటీ-67, రాజమండ్రి సిటీ-66.2. ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి.
Similar News
News March 13, 2025
పిఠాపురం రేపటి పవన్ ప్రసంగంపై సర్వత్రా అసక్తి..!

రేపు పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన అవిర్భావ సభపై రాజకీయంగా భారీ అసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధించడం డిప్యూటీ సీఎంగా మొదటిసారి జరుగుతున్న సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పవన్ చరిష్మా పెరిగింది. దీనితో రేపు ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
News March 13, 2025
రాజమండ్రి: ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం..స్పాట్ డెడ్

స్థానిక మోరంపూడి ఫ్లై ఓవర్ పై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రైల్వే సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న నరేశ్, బి.రమేష్‌లు లాలాచెరువు నుంచి బొమ్మూరు వైపు టూవీలర్ పై వెళ్తున్నారు. మోరంపూడి ఫ్లై ఓవర్‌కు చేరుకునే సమయానికి వెనక నుంచి ఒక కారు ఢీకొట్టడంతో నరేశ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ తీవ్ర గాయాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసలు తెలిపారు.
News March 12, 2025
రాజమండ్రి: 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’

స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 27,441 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అలాగే అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం కింద ఎస్సీ, బిసీలకు రూ.50,000/- & ఎస్టీలకు రూ.75,000 అందజేయనున్నట్లు వెల్లడించారు.