News December 14, 2025
తూ.గో: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిగా మారితే.. ఆడపిల్లల భద్రతకు దిక్కెవరు? ఉప్పలగుప్తం మండలంలో 15 ఏళ్ల కుమార్తెపై <<18555090>>కన్నతండ్రే అత్యాచారానికి<<>> పాల్పడటం సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేసింది. రక్షకుడే రాక్షసుడైన ఈ ఉదంతం పవిత్ర బంధానికి మాయని మచ్చలా మారింది. అల్లారుముద్దుగా సాకాల్సిన వాడే చిదిమేస్తుంటే.. సమాజం ఎటుపోతోందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
Similar News
News December 15, 2025
SRD: కాంగ్రెస్‌లో నామినేషన్ వేసి BRSలో గెలిచాడు!

ఎన్నికల్లో కాంగ్రెస్‌లో సర్పంచ్ టికెట్ రావడంతో సంతోషించి నామినేషన్ వేశాడు. తీరా చూస్తే ఆ పార్టీ మరొకరికి మద్దతు తెలపడంతో బీఆర్ఎస్‌లో చేరాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో చస్మొద్దీన్ భారీ విజయాన్ని సాధించాడు. ఏకంగా 1766 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు.
News December 15, 2025
స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

AP: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్‌కు పంపుతారు. అయితే రేషన్‌కార్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సచివాలయాల్లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ATM తరహాలోని ఈ కార్డులపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబం పూర్తి వివరాలు తెలుస్తాయి.
News December 15, 2025
భద్రకాళి ఆలయంలో భక్తుల సందడి

వరంగల్ భద్రకాళి ఆలయం రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల రాకతో భక్తులతో కిటకిటలాడింది. ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వారి అనుచరులు, అలాగే విజయం కోసం మొక్కుకున్న భక్తులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అమ్మవారి దర్శనం కోసం గుడి ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.


