News January 23, 2025
తూ.గో: కుంభమేళాకు వెళ్లే భక్తులకు శుభవార్త

ఉమ్మడి తూ.గో. జిల్లా నుంచి కుంభమేళాకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ, రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1,4,8 తేదిల్లో కొవ్వూరు, రాజమహేంద్రవరం నుంచి వారం రోజుల యాత్రలో భాగంగా పూరి-కోణార్క్, ప్రయాగ్ రాజ్, కుంభమేళా, వారణసి, బుద్ధగయ, కాశీ తదితదర క్షేత్రాల దర్శనానికి ఒక్కోక్కరికి రూ.10 వేలు టికెట్‌తో మూడు బస్సులను ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
Similar News
News March 7, 2026
పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కీర్తి చేకూరి

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.
News March 6, 2026
సకాలంలో ఇంటి పనులు చెల్లించాలి: కలెక్టర్ కీర్తి చేకూరి

జిల్లాలోని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు, గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.126.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.64.07 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
News March 6, 2026
తూ.గో: టెన్త్ విద్యార్థులకు GOOD NEWS

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని డీపీటీఓ మూర్తి తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. తూ.గో జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


