News February 20, 2025
తూ.గో: కోడిపందేలపై పోలీసుల దాడులు

నల్లజర్ల మండలం ముసళ్లకుంట గ్రామంలో కోడిపందేల స్థావరంపై నల్లజర్ల పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 28 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లు, 7 కార్లు, ఒక మోటార్ సైకిల్ , 2 కోడి పుంజులు , రూ.6.2లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్లజర్ల పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 21, 2025
RJY: మహాశివరాత్రి వేడుకలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.
News February 21, 2025
తాళ్లపూడి : ప్రేమించలేదని యువతిపై దాడి

సీనియర్ ఇంటర్ చదువుతున్న యువతిపై ప్రేమించడంలేదని దిలీప్ కుమార్ (19) దాడి చేసిన ఘటన తాళ్లపూడిలో జరిగింది. చదువు ఆపేసి జులాయిగా తిరిగే దిలీప్ కొంత కాలంగా యువతిని వేధించేవాడు. బుధవారం ఆమె కళాశాల వద్దకు వెళ్లి ప్రేమించకుంటే తన జీవితం నాశనం చేస్తానని బెదిరించి , దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.యువకుడిని గురువారం కోర్టుకు తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
News February 21, 2025
నల్లజర్ల: గుండెపోటుతో పాస్టర్ మృతి

నల్లజర్ల మండలం, చీపురుగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. చీపురుగూడెం గ్రామ నివాసి పాస్టర్ వెంకటేశ్వరరావు గుండెపోటుతో అకస్మాత్తుగా పడిపోవడంతో 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆయన మృతి చెందినట్లు నల్లజర్ల 108 సిబ్బంది నిర్ధారించారు.