News March 5, 2026
తూ.గో: ఖాళీ ఇంటికి రూ.1.99కోట్ల కరెంట్ బిల్లు

సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు విద్యుత్ శాఖ భారీ బిల్లుతో షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో వచ్చిన బిల్లు ఏకంగా రూ.1.99కోట్లుగా ఉండటంతో ఆమె షాక్‌కు గురైంది. ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్‌లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా అని స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు.
Similar News
News April 5, 2026
దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు

*వివేక్ ఎక్స్‌ప్రెస్: దిబ్రూగఢ్ (అస్సాం) నుంచి కన్యాకుమారి. 4,154 కి.మీ 75 గంటల్లో ప్రయాణిస్తుంది
*అరోనై ఎక్స్‌ప్రెస్: సిల్చార్ (అస్సాం) నుంచి తిరువనంతపురం. 3,916 కి.మీ.
*హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్: కన్యాకుమారి నుంచి కత్రా(J&K). 3,789 కి.మీ.
*తిరునెల్వేలి జమ్మూ ఎక్స్‌ప్రెస్: తిరునెల్వేలి (TN) నుంచి కత్రా. 3,642 కి.మీ.
*న్యూ టిన్సుకియా: న్యూ టిన్సుకియా (అస్సాం) నుంచి బెంగళూరు. 3,642 కి.మీ.
News April 5, 2026
NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.
News April 5, 2026
బాపట్ల కలెక్టరేట్‌లో డా.బాబూ జగజ్జీవన్ రామ్‌కు నివాళులు

బాపట్ల కలెక్టరేట్‌లో ఆదివారం డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తదితర అధికారులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.


