News April 22, 2025

తూ.గో: గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

image

మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి సంబంధించి ప్రవేశపరీక్ష హాల్ టికెట్లను నేటి నుంచి https://mjpapbcwreis.apcfss.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లాలోని అమలాపురం, రాజమండ్రి, తుని, పెద్దాపురం పట్టణాల్లోని ఈ గురుకుల పాఠశాల్లో ఈ నెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రవేశ పరీక్ష జరగనుంది.

Similar News

News February 22, 2026

అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్

image

తూ.గో. జిల్లాలో అనూరియా(మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఆదివారం ఫోన్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.

News February 22, 2026

WGL: రేపు TG Ed.CET-2026 నోటిఫికేషన్ విడుదల!

image

తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Ed.CET-2026) నోటిఫికేషన్ రేపు (సోమవారం) విడుదల కానుంది. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎడ్ సెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దరఖాస్తుల ప్రక్రియ మరియు పరీక్షా షెడ్యూల్ వివరాలను వెల్లడించనున్నారు. బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు రేపటి నుండి కీలక తేదీల వివరాలను తెలుసుకోవచ్చు.

News February 22, 2026

రాజమండ్రి: అనూరియా కేసులపై ఎంపీ పురందేశ్వరి సమీక్ష

image

రాజమండ్రిలో నమోదైన అనూరియా కేసులపై ఎంపీ పురంధరేశ్వరి ఆదివారం కలెక్టర్ కీర్తి చేకూరి, డీఎంహెచ్వోలతో ఫోన్‌లో సమీక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కల్తీ అనుమానాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.