News February 12, 2025
తూ.గో: చికెన్, గుడ్ల సరఫరా నిలిపివేత

కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో తూ.గో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్స్‌లో గుడ్లు, చికెన్ సరఫరాను నిలిపివేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి శోభారాణి తెలిపారు. గుడ్లకు బదులుగా బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, ఆదివారం మటన్ కర్రీ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని స్కూళ్లలో గుడ్ల సరఫరా నిలిపివేశారు.
Similar News
News December 17, 2025
నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించండి: పురందీశ్వరి

RJY, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో గతంలో నిలిపిన రైళ్లను పునఃప్రారంభించాలని రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి కోరారు. బుధవారం పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కోవిడ్ అనంతరం రద్దయిన రైలు హాల్టింగ్‌లను పునరుద్ధరించాలని, రానున్న పుష్కరాల దృష్ట్యా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు.
News December 17, 2025
లక్ష్యాల సాధనకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి: సీఎం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన ఐదో జిల్లా కలెక్టర్ల సదస్సులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో జిల్లా పురోగతిని సీఎం సమీక్షించారు. GSDP వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
News December 17, 2025
తూ.గో: సంక్రాంతి కి స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్..

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా మీదుగా పలు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు ఉంటాయి. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ -శ్రీకాకుళం రోడ్డు మధ్య 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీల్లోనూ, శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్‌కు 07295 రైలు జనవరి 14న ట్రైన్స్ నడవనున్నాయి.


