News December 1, 2025

తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

image

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.

Similar News

News February 24, 2026

రాజమండ్రి: కల్తీ పాల ఘటన.. రంగంలోకి స్పెషలిస్ట్ డాక్టర్!

image

రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన సమగ్రంగా పరిశీలించారు సరైన ప్రోటోకాల్‌తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.

News February 24, 2026

రాజమండ్రి: పాల కల్తీకి కారణం ‘కూలెంట్’ లీకేజీ!

image

కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గణేశ్ కూలింగ్ ఛాంబర్‌లో మరమ్మతులు చేస్తుండగా, ఫ్రిడ్జ్‌లోని ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. వరలక్ష్మీ డెయిరీ పేరుతో అనధికారికంగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వారం క్రితమే ఈ లీకేజీ జరిగినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

News February 23, 2026

కల్తీ పాల ఘటన.. నరసాపురంలో ఉన్నతాధికారుల పర్యటన

image

రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్ సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.