News July 31, 2024

తూ.గో.: జగన్‌ను కలిసిన MLC, మాజీ MLA

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌‌ను MLC ఉదయ భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తాడేపల్లిలో బుధవారం కలిశారు. చింతూరు డివిజన్‌లో వరద బాధితులను గురించి జగన్ ఆరా తీసినట్లు ఎమ్మెల్సీ మీడియాకు తెలిపారు. ఆపద సమయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వరద బాధితులకు అండగా ఉండాలని సూచించారని చెప్పారు.

Similar News

News November 1, 2025

పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

image

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

News November 1, 2025

పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: తూ.గో కలెక్టర్

image

‘ఎన్టీఆర్‌ భరోసా’ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన 2,35,031 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని రాజమండ్రిలో ఆమె వివరించారు. ఇందుకోసం రూ.103.17 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.