News March 25, 2024

తూ.గో.: జాతరలో కత్తిపోట్లు.. బాలుడు మృతి

image

తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం వెంకటరెడ్డిపేటలో సోమవారం జరిగిన జాతరలో 2వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఇందులో రాంగోపాలపురానికి చెందిన సాయికుమార్(16) మృతిచెందాడని పోలీసులు తెలిపారు. జాతరలో భద్రాచలం, రాంగోపాలపురం గ్రామానికి చెందిన యువకులు రెండు వర్గాలుగా విడిపోయి దెబ్బలాడుకున్నారు. భద్రాచలం యువకులు కత్తులతో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సాయికుమార్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. 

Similar News

News April 11, 2025

తూ.గో: జిల్లా మీదుగా 24 సమ్మర్ స్పెషల్ రైళ్లు

image

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా ఈనెల 11 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో సమ్మర్ స్పెషల్ రైలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. 07025 చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్డు వద్ద ప్రతి శుక్రవారం, 07026 శ్రీకాకుళం రోడ్డు – చర్లపల్లి రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుదని పేర్కొన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 10, 2025

తూ.గో: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై డీఆర్ఓ సమావేశం

image

ఓటర్ల జాబితాల నాణ్యత, స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియజేశారు. గురువారం డీఆర్‌ఓ ఛాంబర్‌లో అసెంబ్లీ నియోజక వర్గాల ఈఆర్ఓలు తదితర సిబ్బందితో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడారు.

News April 10, 2025

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ద్వారపూడి – కడియం రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడని రాజమండ్రి జీఆర్పీ ఎస్ఐ మావుళ్ళు గురువారం తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుడు బ్లూ కలర్ ప్యాంటు, పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. మృతుడి వద్ద టాటానగర్ నుంచి పాలకాడ వరకు జనరల్ టికెట్ లభ్యమైందన్నారు. 

error: Content is protected !!