News October 3, 2025
తూ.గో జిల్లాకు 53 అవార్డులు: కలెక్టర్ కీర్తి

“స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఈనెల 6న స్థానిక ఆనం కళా కేంద్రంలో అవార్డులను అందజేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రా -స్వర్ణ ఆంధ్రాలో తూ.గో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని తెలిపారు. ప్రజా ప్రతినిధుల, అధికారుల, సిబ్బంది కృషికి ఇది నిదర్శనం అని కలెక్టర్ అన్నారు.
Similar News
News October 3, 2025
బాణాసంచా విక్రయాలకు లైసెన్సులు తప్పనిసరి: డీఎస్పీ

చాగల్లు మండలంలో శుక్రవారం బాణాసంచా దుకాణాలను డీఎస్పీ దేవకుమార్ తనిఖీ చేశారు. లైసెన్సులు లేకుండా విక్రయాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాణాసంచా తయారీ, నిల్వ చేసేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. షాపుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీరు, మంటలు ఆర్పే అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలకు మేర పనిచేయాలన్నారు. ఎస్సై నరేంద్ర పాల్గొన్నారు.
News October 3, 2025
జీఎస్టీ తగ్గిన మందుల ధరలపై అవగాహన పెంచాలి: డీఎంహెచ్ఓ

జీఎస్టీ తగ్గిన మందుల ధరలపై ప్రజలకు అవగాహన పెంచాలని డీఎంహెచ్‌వో కె.వెంకటేశ్వరరావు సూచించారు. జీఎస్టీ 2.0 సంస్కరణ ద్వారా మందులు వైద్య పరికరాలపై ఇప్పటివరకు 12 శాతం ఉన్న జీఎస్టీ ఐదు శాతానికి తగ్గిందన్నారు. కొన్నింటిపై పూర్తిగా తగ్గించడం ద్వారా రోగులకు చికిత్స మరింత చౌకగా లభించిందన్నారు. చిన్నారులకు అవసరమైన ఫీడింగ్ బాటిల్స్, లైనర్లు, నాప్కిన్లు వంటి వస్తువులపై పూర్తి శాతం జీఎస్టీ తగ్గించారన్నారు.
News October 3, 2025
రాజమండ్రి: గౌతమీ తీరాన మహాత్ముని అడుగుజాడలు

రాజమండ్రి గాంధీ జయంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ వద్ద స్వాతంత్ర సమరయోధుల పార్కులో బాపుకి పలువురు నివాళులర్పించారు. గౌతమీ తీరాన స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో 1921-46 మధ్య కాలంలో మహాత్ముడు రాజమహేంద్రవరానికి 5 సార్లు వచ్చారు. 1921 మార్చి 30న, అదే సంవత్సరం ఏప్రిల్ 4న, 1929 మే 6 న, 1933 డిసెంబర్ 25న, 1946 జనవరి 20న రాజమండ్రి నగరంలో పలు బహిరంగ సభల్లో ప్రసంగించారని బాపుకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.