News November 13, 2024

తూ.గో జిల్లాలో ఇసుక ధరలు ఇవే

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రీచ్‌ల వారీగా ఇసుక ధరల వివరాలను జిల్లా గనుల, భూగర్భ శాఖ మంగళవారం ప్రకటించింది. వేమగిరి, కడియపులంకలో రూ.61.37, వంగలపూడి 1,2లలో రూ 70.19, 67.59, ములకలలంక, కాటవరంలలో రూ.61.36, తీపర్రు రూ.96.02, ముక్కామల 2 రూ.116.49, కాకరపర్రు 117.02, పందలపర్రు రూ.104.42గా నిర్ణయించారు. ఈ ధరలకు మించి వసూలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.

Similar News

News November 14, 2024

పెద్దాపురం: హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

కల్లు గీత కత్తితో ఇద్దరిని హతమార్చిన కేసులో ముద్దాయికి బుధవారం జీవిత ఖైదు విధిస్తూ పెద్దాపురం కోర్టు తుది తీర్పు ఇచ్చినట్లు జగ్గంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేటకు చెందిన వానశెట్టి సింహాచలం భార్యతో నైనపు శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడిని, దానికి సహకరించిన బత్తిన భవానీని హతమార్చాడు. దీనిపై 2013లోనే కేసు నమోదైంది. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత తుది తీర్పు వెలువడింది.

News November 13, 2024

గోకవరం: 1250 కేజీల నకిలీ టీపొడి స్వాధీనం..

image

గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని రైస్ మిల్లులో నకిలీ టీపొడి తయారు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 31 బస్తాల్లో నిల్వ ఉన్న 1250 కేజీల నకిలీ టీపొడిని ల్యాబ్‌కు పంపించామన్నారు. వాటితోపాటు 15క్రీం మెటీరియల్ బ్యాగులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టీపొడి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. 

News November 13, 2024

సైబర్ నేరాలపై తస్మాత్ జాగ్రత్త : ఎస్పీ నరసింహ

image

ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయడం గాని, సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే కాల్స్‌, మెసేజ్‌లకు ఎట్టి పరిస్థితులలోను స్పందించవద్దన్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఆన్లైన్లో డబ్బులు పంపించడం చేయరాదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.