News December 14, 2025
తూ.గో జిల్లాలో పులి కలకలం

గోపాలపురం మండలం భీమోలు మెట్టపై పులి సంచరిస్తోందన్న ప్రచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి, రెండు పిల్లలు కనిపించాయని రైతు రామకృష్ణ ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం పాదముద్రల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. నిఘా కోసం ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News December 14, 2025
HYD: PUBలు CLOSE అయ్యాక ఎక్కడికెళ్తున్నారో తెలుసా?

మిడ్‌నైట్ 12:30 క్లబ్‌లు మూతపడాలనే రూల్ ఉంది. కానీ, ఎంత రాత్రయినా యూత్ పార్టీ జోష్ తగ్గడం లేదు. పబ్‌ల నుంచి బయటికి రాగానే అంతా కలిసి 24/7 ఫుడ్ కోర్టులు, లేక్ సైడ్ హాంగ్ అవుట్‌లు, HYD శివారులోని ఫామ్‌హౌస్‌లకు పోతున్నారు. దీనికి ‘దక్కన్ మైగ్రేషన్’ అని పేరు పెట్టారు. ఈ మిడ్ నైట్ షిఫ్ట్‌తో టైమ్ అయిపోయిందన్న టెన్షన్ లేకుండా తమ ఫ్రెండ్స్‌తో కలిసి 24/7 టైమ్ స్పెండ్ చేసేందుకు కొత్త దారి వెతుకుతున్నారు.
News December 14, 2025
కడప జిల్లాలో పలువు సీఐల బదిలీ

కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జోన్‌లో మొత్తం 31 మంది సీఐలను ఆయన బదిలీ చేశారు. ప్రొద్దుటూరు టూటౌన్ సదాశివయ్య, త్రీటౌన్ వేణుగోపాల్, కడప వీఆర్ మోహన్, కమలాపురం రోషన్, ముద్దనూరు దస్తగిరి, కడప వీఆర్ నారాయణప్ప, కడప CCS కృష్ణంరాజు, LR పల్లె కొండారెడ్డి, కడప టూటౌన్ సుబ్బారావు ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ అయ్యారు.