News December 12, 2024
తూ.గో జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన
సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత జగన్ ఉభయ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.
Similar News
News December 26, 2024
తూ.గో: దిశ మార్చుకున్న అల్పపీడనం..వర్షాలు ఎక్కడంటే
బంగాళాఖాతంలో కోనసాగుతున్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది. దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. గురువారానికి వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని రైతులు రెండు రోజులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News December 26, 2024
తూ.గో: సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లేది ఎలా..?
సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారికి టిక్కెట్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. రైలు, బస్సు టికెట్లు ధరలు చూసి షాక్ అవుతున్నారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి, సామర్లకోటకు 17 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ఒక్క టిక్కెట్ కూడా దొరకని పరిస్థితి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురానికి ప్రైవేట్ ఏసీ స్లీపర్ ఛార్జీ రూ.1,100 ఉండగా దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుతం 50 బస్సులు ఉండగా, వాటిని 70కి పెంచినా ధర తగ్గలేదు.
News December 26, 2024
రాజమండ్రి: రైలు నుంచి జారిపడిన మహిళ.. చికిత్స పొందుతూ మృతి
రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారీపడడంతో గోదావరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.