News January 23, 2026
తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
Similar News
News January 27, 2026
తూ.గో: APPSC పరీక్షలపై డ్రోన్ నిఘా

తూ.గో. జిల్లావ్యాప్తంగా APPSC పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. అక్రమాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలు విధుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు.
News January 25, 2026
BREAKING.. రుడా పరిధిలో భూముల విలువ పెంపు

రుడా పరిధిలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాజమండ్రిలో ఆదివారం కలెక్టర్ మేఘ స్వరూప్ దీనిపై సమావేశం నిర్వహించారు. పెంపుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 29 లోపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలపాలని కోరారు. పెరిగిన ధరలు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు వర్తిస్తాయన్నారు.
News January 25, 2026
రాజమండ్రి: రేపు PGRS కార్యక్రమం రద్దు

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన PGRSను రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. రిపబ్లిక్ డే కారణంగా రెవెన్యూ క్లినిక్ అర్జీల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.


