News August 23, 2024
తూ.గో జిల్లా అడిషనల్ ఎస్పీగా వెంకట సుబ్బరాజు

తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) గా అల్లూరి వెంకట సుబ్బరాజు గురువారం రాజమండ్రిలో బాధ్యత స్వీకరించారు. 1989 బ్యాచ్ కు చెందిన అల్లూరి వెంకట సుబ్బరాజు గతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) గా నియమితులయ్యారు.
Similar News
News April 5, 2026
ఏప్రిల్ 6న యథావిధిగా పీజీఆర్ఎస్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6న యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 4, 2026
15 చోట్ల కల్తీ పాలు..!

కల్తీ పాల నివారణకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో పశు సంవర్ధక, ఫుడ్ సేఫ్టీ విభాగాలు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 705 పాల నమూనాలను పరీక్షించగా, 15 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు టి.శ్రీనివాస రావు, కె.సుప్రియ వెల్లడించారు. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని తెలిపారు.