News December 13, 2025
తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం తనిఖీ చేసిన SP

తూ.గో. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని SP డి.నరసింహ కిషోర్ శనివారం సందర్శించారు. త్వరలో స్టైపెండరీ క్యాడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన పనులు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. ఎటువంటి అంతరాయం లేకుండా పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News February 1, 2026
సీతానగరం: ‘త్వరలోనే పులిని బంధిస్తాం’

సీతానగరం మండలం తొర్రేడులో పులి సంచరిస్తుండటంతో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రావు ఆదివారం సూచించారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లరాదని కోరారు. పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, త్వరలోనే బంధిస్తామని ధైర్యం చెప్పారు. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
News February 1, 2026
మహిళలకు ఆదాయ మార్గాలు కల్పించడమే లక్ష్యం: కలెక్టర్

గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యంగా పర్యావరణహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లతో పాటు మార్కెటింగ్ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల మహిళలు సీడీఐపీసీ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళా సాధికారతకు జిల్లా యంత్రాంగం మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.
News February 1, 2026
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఆదివారం పలు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని, కఠినమైన పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, సేవనంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నేర రహిత జిల్లా కోసం పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


