News March 11, 2025

తూ.గో.జిల్లా ప్రజలారా ఇవాళ జాగ్రత్త.!

image

తూ.గో.జిల్లా ఇవాళ వేడెక్కనున్నది. ముఖ్యంగా భానుడు తన ప్రతాపాన్ని జిల్లాలోని సీతానగరం 38.6, తాళ్లపూడి 38.5, గోపాలపురం 38.4, గోకవరం 38.3, కోరుకొండ 38.3, రాజమండ్రి 37.9, రాజానగరం 37.5, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి వృద్ధులు, పిల్లలు జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 11, 2025

కోరుకొండ: ఆకట్టుకుంటున్న నరసింహుడి గిరి

image

రాజానగరం నియోజకవర్గ మండలం ప్రధాన కేంద్రమైన కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వైకుంట ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట విద్యుత్ దీపా అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ గిరి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

News March 10, 2025

రాజానగరం: 12మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

రాజానగరం హైవేని ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ కౌంటీలోని ఒక విల్లాలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాను రాజానగరం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 12మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 26 మొబైల్స్, 7 ల్యాప్‌ట్యాప్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీపై ఈ బెట్టింగ్స్ జరిగాయి.

News March 9, 2025

రాజమండ్రి: సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

image

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఇకపై ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చశారు. ఈ మేరకు గతంలో మాదిరిగానే ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలియచేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!