News January 25, 2026
తూ.గో జిల్లా వాసికి పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

రాజమండ్రికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గతంలో టీటీడీ, అహోబిలం, కంచికోటి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. అన్నమాచార్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. వేలాది కీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెల్లకు ఈ గౌరవం దక్కడంపై సంగీత ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 10, 2026
నల్గొండ: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

శాలిగౌరారం మండలంలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గత నెల 20న బాధితురాలిని నిందితుడు ఇంట్లోకి పిలిచి, కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపడంతో, మంగళవారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2026
విశాఖకు మెట్రో రైలు.. 3 రూట్లు ఇవే

AP: సుమారు 46KM పొడవు, 3 కారిడార్లు, రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ మెట్రోకు కేంద్రం ఓకే చెప్పింది.
*30-35KM దూరంతో స్టీల్ ప్లాంట్(గాజువాక)-కొమ్మాది మధ్య అత్యంత పొడవైన కారిడార్ ఏర్పాటు కానుంది.
*సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు 5-6KM దూరంతో గురుద్వారా జంక్షన్-ఓల్డ్ పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్ రానుంది.
*6-7KM దూరంతో పర్యాటకం+సిటీని కలుపుతూ తాటిచెట్లపాలెం-RK బీచ్ వరకు మూడో కారిడార్ వస్తుంది.
News February 10, 2026
డ్రోన్ పెట్రోలింగ్‌తో కర్నూలు పోలీసుల స్మార్ట్ నిఘా

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ జిల్లా పోలీసు శాఖ డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించింది. డీజీపీ కార్యాలయం నుంచి కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆవిష్కరించారు. డే, నైట్ విజన్ సౌకర్యంతో పనిచేసే ఈ డ్రోన్లు జిల్లావ్యాప్తంగా నిరంతర నిఘా నిర్వహించనున్నాయి. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కాలేజీలు, పాఠశాలల ప్రత్యేక నిఘాకు ఉపయోగపడతాయన్నారు.


