News February 23, 2025

తూ.గో. జిల్లా TODAY TOP NEWS

image

➤ రాజమండ్రి: రేపు PGRS రద్దు ➤ గోకవరం: ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ ➤ అనపర్తి: నల్లమిల్లి ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు ➤ రాజమండ్రి: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ➤ బిక్కవోలులో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర ➤ రాజమండ్రి: పార్లమెంటు పరిధిలో పర్యటించిన ఎంపీ ➤ దేవరపల్లి: చికెన్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత ➤ రాజమండ్రి: ‘MLC అభ్యర్థి రాజశేఖర్‌ని గెలిపించండి’

Similar News

News February 24, 2025

రాజమండ్రి: కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

కేంద్ర బడ్జెట్ 2025 మేధావుల సమావేశం రాజమండ్రిలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఎంపీ పురందీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2025

RJY: నేడు గ్రూప్-2 పరీక్ష..పావుగంట ముందే గేట్ క్లోజ్

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటాన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్‌పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.

News February 23, 2025

అనుమతులు లేకుండా మట్టి తవ్వితే శిక్షార్హులు: కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి క్వారీ నిర్వహణ చేపట్టరాదని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో ఆదేశించారు. అనుమతి రవాణా పత్రం లేకుండా ఖనిజ రవాణా నిర్వహించకూడదన్నారు. నియమాలు ఉల్లంఘన చేసిన వారు శిక్షార్హులని, అటువంటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

error: Content is protected !!