News June 26, 2024

తూ.గో: తల్లి మరణించిన కాసేపటికే కొడుకు కన్నుమూత

image

తల్లి మరణించిన కాసేపటికి కొడుకు కన్నుమూసిన విషాద ఘటన తాళ్లరేవులో జరిగింది. మృతుడి భార్య 8ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నూకరాజుకు పక్షవాతం ఉండడంతో తల్లి కామేశ్వరి చేపల వ్యాపారం చేసి చూసుకొనేది. మంగళవారం రక్తపోటు రాగా ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. నూకరాజుకు తల్లిని చూపించి దహనసంస్కారాలకు తీసుకెళ్లారు. దీంతో కాసేపటికే కొడుకు కన్నుమూశారు.

Similar News

News June 29, 2024

తూ.గో రైతులకు సిరులు కురిపిస్తున్న పొగాకు

image

తూ.గో జిల్లాలో రైతాంగానికి పొగాకు సిరులు కురిపిస్తుంది. ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియా పొగాకు గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధర పలుకుతుంది. పొగాకు సాగు ప్రారంభం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్ల కాలంలో కిలో పొగాకు రూ.368 పలికింది. దీంతో తమ కష్టానికి తగిన ఫలితం చూస్తున్నామనే భావనతో పొగాకు రైతుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

News June 29, 2024

నేడు 15 కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 15 కోర్టులో శనివారం 10 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు శుక్రవారం తెలిపారు. ☞ తూ.గో జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి☞ కాకినాడ జిల్లాలో కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు☞ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, ముమ్మిడివరం, కొత్తపేటలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు.

News June 29, 2024

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

image

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర చెప్పారు. ఈ గన్నవరం మండలం బెల్లంపూడి ఎస్సీ పేటలో శుక్రవారం సర్పంచ్ బండి మహాలక్ష్మితో కలిసి పర్యటించారు. సీజనల్ జ్వరాల బాధితుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, బయట ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు.