News February 27, 2025

తూ.గో : తీరని విషాదం నింపిన శివరాత్రి

image

ఆ ఐదుగురికి 20 ఏళ్లు దాటలేదు. శివరాత్రి రోజే వారిని మృత్యువు వెంటాడింది. రెండు వేరువేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. తాళ్లపూడి(M) తాడిపూడిలో పుణ్యస్నానానికి వెళ్లి పవన్(17), దుర్గాప్రసాద్(19), పవన్(19), ఆకాష్ (19), పడాల సాయి(19) ఐదుగురు గల్లంతై చనిపోయారు. ప్రతిపాడు(M) రాచపల్లి నుంచి పట్టిసీమకు వెళుతుండగా చిడిపి వద్ద ఆటో బోల్తాపడటంతో రమణ అనే వ్యక్తి చనిపోయారని పోలీసులు తెలిపారు.

Similar News

News February 27, 2025

పాల్వంచ డ్రోన్ సర్వేను ప్రారంభించిన కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో గల పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 లో భాగంగా డ్రోన్ సర్వేను పుర అధికారులతో కేంద్ర బృందం సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఈ డ్రోన్ సర్వేను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించి, పలు సూచనలు చేశారు. ఈ సర్వేలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 27, 2025

‘కూలీ’లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమాలో స్టార్ నటి పూజా హెగ్డే జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌‌గా, శివ కార్తికేయన్, నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ‘కూలీ’పై అంచనాలు భారీగా పెరిగాయి.

News February 27, 2025

సిరిసిల్ల: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

image

జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. సిరిసిల్లలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు 163 BNSS యాక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన కోరారు.

error: Content is protected !!