News May 20, 2024
తూ.గో.: నకిలీ ఖాతాతో వేధింపులు.. ఇద్దరిపై కేసు

నకిలీ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి అర్ధ నగ్నచిత్రాలు పంపిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశామని నిడదవోలు SI అప్పారావు ఆదివారం తెలిపారు. తూ.గో. జిల్లా సమిశ్రగూడేనికి చెందిన దుర్గాప్రసాద్ పట్టణంలోని ఓ వివాహిత పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించి మరో మహిళ ఫోన్‌కు మహిళల అర్ధనగ్న చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపించారు. వివాహితకు విషయం తెలియటంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.
Similar News
News February 26, 2026
కోర్టు కేసులతో విసిగిపోయారా? ఇదే మంచి ఛాన్స్!

ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ వంటి కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ ద్వారా త్వరితగతిన ముగించుకోవాలని ఆమె సూచించారు.
News February 26, 2026
లెక్క తేల్చేందుకు కసరత్తు.. ముహూర్తం ఫిక్స్!

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
News February 26, 2026
CM మాట ఇచ్చారు.. అధికారులు పని మొదలెట్టారు!

తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రజావేదికలో సనమండ్ర పోసియ్యకు ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాలతో హౌసింగ్ అధికారులు, MRO గురువారం లబ్ధిదారుడి అసంపూర్తి గృహాన్ని పరిశీలించారు. హౌసింగ్ విభాగం నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. CM ఆదేశాలతో పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


