News February 4, 2025

తూ.గో: నగ్నా చిత్రాలు పేరుతో రూ.2.53 కోట్లు స్వహ

image

ఆశ్లీల వీడియోల పేరుతో బెదిరించి నిడదవోలు శాంతి నగర్‌కు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన నినావత్ దేవనాయక్‌‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు సీఐ తిలక్ సోమవారం విలేకరులకు తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడన్నారు. నిందితుడి నుంచి 1.84 నగదు, స్థిరాస్తులను సీజ్ చేశామన్నారు.

Similar News

News November 6, 2025

గ్లోబల్ స్థాయిలో ‘రాజాసాబ్’ ప్రమోషన్స్!

image

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ మారుతి ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి సింగిల్, ప్రతి 10 రోజులకు కొత్త సాంగ్ విడుదల కానున్నట్లు పేర్కొన్నాయి. అలాగే క్రిస్మస్ సమయంలో అమెరికాలో ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ కూడా రానుందని పేర్కొన్నాయి.

News November 6, 2025

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి అత్యల్పంగా గోవిందారం, మన్నెగూడెంలో 18.4℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గొల్లపల్లి, పూడూర్, కథలాపూర్ 19, మద్దుట్ల 19.2, పెగడపల్లి 19.3, తిరుమలాపూర్ 19.4, మల్యాల, జగ్గసాగర్, రాఘవపేట 19.5, మల్లాపూర్, కోరుట్ల 19.6, నేరెళ్ల, రాయికల్, ఐలాపూర్ 19.7, గోదూరు, పొలాస, సారంగాపూర్ 19.8, మేడిపల్లి 19.9, జగిత్యాలలో 20.1℃గా నమోదైంది.

News November 6, 2025

వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

image

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్‌ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.