News December 28, 2025
తూ.గో: నది మింగిన నవ్వులు.. రోడ్డుపై రక్తపు మరకలు

ఉమ్మడి తూ.గో జిల్లాను 2025 ఏడాది వరుస ప్రమాదాలు ఉలిక్కిపడేలా చేశాయి. మేలో ముమ్మిడివరం వద్ద నదిలో స్నానానికి వెళ్లిన 8మంది యువకులు చనిపోగా, జూన్‌లో రంగంపేట సమీపాన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అక్టోబరులో రాయవరం బాణసంచాలో జరిగిన భారీ పేలుడు ఏడుగురిని బలితీసుకుని అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలు అనేక కుటుంబాల్లో పుట్టెడు దుఃఖాన్ని నింపాయి.
Similar News
News January 2, 2026
కొండగట్టు: పవన్ కళ్యాణ్ రాక.. భారీ బందోబస్తు ఏర్పాటు

కొండగట్టులో ప్రతి పౌర్ణమికి నిర్వహించే గిరిప్రదక్షిణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక రెండు ఒకే రోజు కావడంతో రేపు కొండగట్టు భక్తులు, అభిమానులతో కిటకిటలాడనుంది. ప్రతి గిరిప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే అదే రోజు టీటీడీచే నిర్మిస్తున్న వసతి గదుల శంకుస్థాపనకు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో దాదాపు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
News January 2, 2026
నెల్లూరు జిల్లాలో 16 పీడీ యాక్టులు

నెల్లూరులో 2025లో గంజాయి బ్యాచ్‌కు ఓ వ్యక్తి బలయ్యాడు. అరుణ తర్వాత మరో లేడీ డాన్ కామాక్షి వెలుగులోకి వచ్చింది. వరుస నేరాలపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ రౌడీషీట్లు తెరిచారు. 3కంటే ఎక్కువ కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2025లో మొత్తం 16 మందిపై పీడీయాక్ట్, 34మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 102 మందిని రిమాండ్‌కు పంపారు. 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
News January 2, 2026
ఓడీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యాల సాధనకు వేగం పెంచాలి: VZM కలెక్టర్

టెలికాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ పూర్తయిన గ్రామాలను వెంటనే డిక్లేర్ చేయాలని, ఇప్పటికే డిక్లేర్ చేసిన గ్రామాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రోజుకు 47 వేల మాన్‌డేస్ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలన్నారు.


