News February 14, 2025
తూ.గో: నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.
Similar News
News November 11, 2025
కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం

కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకున్న తల్లిని కత్తితో పొడిచిన ఘటన MHBD జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సింహులపేట(M) కొమ్ములవంచ గ్రామంలో బూరుగండ్ల రవికి పారునంది అర్జున్‌లకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో రవిని కత్తితో అర్జున్ను పొడుస్తుండగా అడ్డుకోబోయిన అతడి తల్లి సునీతను చేయి దగ్గర పొడిచాడు. వారిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.
News November 11, 2025
ఢిల్లీ పేలుళ్లు.. అర్ధరాత్రి వరంగల్‌లో ముమ్మర తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం అర్ధరాత్రి ట్రై సిటీ పరిధిలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు.


