News March 24, 2025
తూ.గో: నేడు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రేపు యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో, డివిజన్,మున్సిపల్ మండల కేంద్రాలలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి జిల్లా, డివిజన్ మండల, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు.
Similar News
News March 26, 2025
ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: జేసీ

జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్‌ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
News March 25, 2025
కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.
News March 25, 2025
రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.