News May 11, 2024

తూ.గో.: నేడే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.
– మన తూ.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

Similar News

News November 25, 2024

రేపు యథావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్ ప్రశాంతి

image

సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండలస్థాయిలో అధికారులు తీసుకుని త్వరతగతిన పరిష్కారిస్తారని ఆమె తెలిపారు.

News November 24, 2024

కోనసీమ వాసికి అవార్డు అందించిన సినీ నటి కీర్తి సురేశ్

image

ఉమ్మడి తూ.గో.జిల్లా పి.గన్నవరంలో రెండున్నర దశాబ్దాల నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీగా సభ్యులకు సేవలు అందిస్తున్నందుకు ధనవర్ష సొసైటీకి ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ అవార్డు అందించారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్‌లో శనివారం జరిగిన సమావేశంలో అవార్డు అందించారని సంగం ఛైర్మన్ కంకిపాటి ప్రసాద్ ఆదివారం తెలిపారు.

News November 24, 2024

గోకవరం: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి 

image

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన విషాదకర ఘటన గోకవరం ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన వెంకటలక్ష్మి గోకవరం ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లో పని చేస్తున్నారు. ప్రసవం నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా ఉమ్మనీరు రక్తనాళాల్లోకి వెళ్లి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను చూడకుండానే మృతి చెందడం కలిచివేసింది.