News March 29, 2025
తూ.గో: పదో తరగతి పరీక్ష వాయిదా- DEO

ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు అన్నారు. సోషల్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.
Similar News
News March 31, 2025
KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్‌లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్‌లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.
News March 31, 2025
అర్ధరాత్రి కారు వీరంగం.. ఇద్దరు స్పాట్‌డెడ్

రాజమండ్రి రూరల్ కొంతమూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీపేటకి చెందిన ఈర్లు నాగబాబు (44) ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి బైక్ రైడ్‌లో ఉండగా మనీష్ ఫంక్షన్ హాల్ వద్ద మద్యం మత్తులో కారులో నలుగురు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టారు. దీంతో నాగబాబుతో పాటు వెనక కూర్చున్న కస్టమర్ వీరబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
News March 31, 2025
రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

బైక్‌పై రాజమండ్రిలోని అత్తారింటికి శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. JRG(M) లక్కవరానికి చెందిన నాగేశ్వరరావు తన భార్య రమణమ్మ, కొడుకు షణ్ముఖ్, కుతూరు జాహ్నవితో కలిసి బైక్‌పై బయలుదేరారు. సీతంపేట వద్ద రోడ్డు అంచున ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో వీరనాగేశ్వరరావు మృతి చెందారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్ తెలిపారు.