News September 20, 2024

తూ.గో.: ‘పిడుగులు పడతాయి జాగ్రత్త’

image

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని ప్రజల ఫోన్లకు సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు వచ్చాయి. కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, రాజమండ్రి, రంపచోడవరం, కోనసీమ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News October 13, 2024

కోనసీమ: డీజే సౌండ్‌కు యువకుడి మృతి

image

కోనసీమ జిల్లాలో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురం మండలం కొంకాపల్లిలో శనివారం రాత్రి డీజే సౌండ్‌కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో డీజే సౌండ్‌కు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వినయ్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

News October 13, 2024

అమలాపురం: ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎంపికపై సర్వే

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేపట్టారు. అమలాపురం టీడీపీ యువ నాయకుడు చెరుకూరి సాయిరామ్, ముమ్మిడివరానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం టీడీపీ సీనియర్ నాయకుడు రమణబాబు, వాసంశెట్టి వెంకట సత్య ప్రభాకర్‌, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

News October 12, 2024

కాకినాడ జిల్లాలో రావణ దేవాలయాన్ని చూశారా..!

image

లంకాధిపతి రావణాసురుడి దేవాలయం మన కాకినాడ రూరల్ సాగర తీరాన ఉంది. దసరా వేళ పలు ప్రాంతాల్లో రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో రావణాసురుని పూజించటం మరో విశేషం. దీన్ని కుంభాభిషేకం గుడి అని కూడా పిలుస్తారు. ఆయన ఆది కుంభేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటారు.