News June 19, 2024
తూ.గో.: ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి.. రియాక్షన్ ఇదే

రాజమండ్రి రూరల్ MLA బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఓ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘42 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేం పెద్ద పోస్టు కాదు’ అని అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా తన నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని అన్నారు. ఎక్కడైనా గెలవగల సత్తా తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఆ ధైర్యాన్ని ప్రజలు ఇచ్చారన్నారు.
Similar News
News November 5, 2025
రాజమండ్రి: ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0 కింద అర్హులను గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నవంబర్ 30వ తేదీ లోగా అర్హులైన పేదల వివరాలు సేకరించాలని కలెక్టర్ హౌసింగ్ అధికారి ఎన్. బుజ్జిని ఆదేశించారు.
News November 5, 2025
మైనారిటీలకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ: సునీల్

రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కార్పొరేషన్ ఉమ్మడి తూ.గో జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు ఎం.సునీల్ కుమార్ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్, ఏపీ టెట్, డీఎస్సీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు విజయవాడ భవానిపురంలోని CEDM Office, ఫోన్: 0866-2970567 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
News November 4, 2025
డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం: కలెక్టర్

జిల్లాకు చెందిన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, అవసరమైన శిక్షణ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ ఇండియా క్యాంపస్ హెడ్ మెర్లిన్ కలెక్టర్‌ని కలిశారు. సదర్లాండ్ సంస్థ రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు, అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు.


