News November 29, 2024

తూ.గో: ఫుల్ టెన్షన్… వారందరికీ కునుకు కరవు

image

తుపాను ప్రభావంతో ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట నీటిపాలవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరించారు.

Similar News

News November 30, 2024

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం కోసం వేట

image

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో మత్స్యకారులు కనకం కోసం వేటను ప్రారంభించారు. తుఫాన్, అల్పపీడనాలు ఏర్పడిన సందర్భాల్లో సముద్రగర్భంలో నుంచి బంగారు రజ కొట్టుకొస్తుందని మత్స్యకారుల నమ్మకం. ఒక్కొక్కరూ దువ్వెన పట్టుకుని, కెరటాలు ఒడ్డుకొచ్చి తిరిగి లోపలకు వెళ్లే సమయంలో ఇసుకపై దువ్వెనతో అడ్డుపెడతారు. ఆ సమయంలో ఇసుక లోపల నుంచి చిన్న బంగారు రజను వారికి దొరుకుతుందేమోనని ఆసక్తి చూపుతారు.

News November 30, 2024

కాకినాడ: పవన్ ఆగ్రహం.. అధికారులపై యంత్రాంగం చర్యలు

image

పీడీఎస్ రైస్ అక్రమ తరలింపు అంశంపై కాకినాడ జిల్లా డీఎస్ఓ ఎంవీ ప్రసాద్‌పై రాష్ట్ర యంత్రాంగం చర్యలు తీసుకుంది. కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలు చేయగా అక్రమ రవాణాపై ఆగ్రహించారు. అనంతరం యంత్రాంగం కొంతమంది అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఎంవీ ప్రసాద్‌ను పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఎస్ఓగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు.

News November 29, 2024

అఖండ గోదావరి ప్రాజెక్టులో అభివృద్ధి చేసేవి ఇవే..

image

అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా కేంద్రం రూ.94.44 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు అక్వేరియం టన్నెల్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, గ్లాస్ బ్రిడ్జి, గోదావరి కాలువలు, కడియం నర్సరీలను సైతం డెవలప్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు.