News June 13, 2024

తూ.గో: బాలికపై తాత లైంగిక దాడికి యత్నం

image

రంపచోడవరం నియోజకవర్గ పరిధి అడ్డతీగల మండంలోని ఓ గ్రామంలో 6 ఏళ్ల బాలికపై తాత వరసయ్యే చిన్నారెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడ్డట్లు ఎస్సై అప్పలరాజు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. బాలిక బుధవారం ఇంటి బయట ఆడుకుంటుంది. ఆమెకు పనసతొనలు ఇస్తానని ఆశచూపి ఇంటి పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పింది. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Similar News

News November 5, 2025

రాజమండ్రి: ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు గృహ వసతి కల్పించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0 కింద అర్హులను గుర్తించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నవంబర్ 30వ తేదీ లోగా అర్హులైన పేదల వివరాలు సేకరించాలని కలెక్టర్ హౌసింగ్ అధికారి ఎన్. బుజ్జిని ఆదేశించారు.

News November 5, 2025

మైనారిటీలకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ: సునీల్

image

రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ప్రభుత్వ ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కార్పొరేషన్ ఉమ్మడి తూ.గో జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు ఎం.సునీల్ కుమార్ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్, ఏపీ టెట్, డీఎస్సీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు విజయవాడ భవానిపురంలోని CEDM Office, ఫోన్: 0866-2970567 నంబర్‌ను ‌సంప్రదించాలని ఆయన కోరారు.

News November 4, 2025

డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం: కలెక్టర్

image

జిల్లాకు చెందిన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, అవసరమైన శిక్షణ సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ ఇండియా క్యాంపస్ హెడ్ మెర్లిన్ కలెక్టర్‌ని కలిశారు. సదర్లాండ్ సంస్థ రాజమండ్రిలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు, అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు.