News June 6, 2024

తూ.గో.: మంత్రి పదవి ఎవరికి..?

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లో గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ MLAలో ముగ్గురికి మంత్రి పదవి దక్కింది. రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం- పినిపే విశ్వరూప్, తుని- దాడిశెట్టి రాజా మంత్రులుగా పనిచేశారు. మరి ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ఐదుగురు, టీడీపీ నుంచి 14మంది MLAలుగా గెలిచారు. మరి ఈ సారి జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది.. ఎందరికి వస్తుంది..?
– మీ కామెంట్..?

Similar News

News September 28, 2024

రాజమండ్రి: చిరుత కనిపించలేదు: DFO

image

కడియం మండలం బుర్రిలంక పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు ఇంకా గుర్తించలేదని, పాదముద్రలు కూడా కనిపించలేదని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి శనివారం తెలిపారు. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా ఏ విధమైన సమాచారం లభించలేదన్నారు. బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉన్న నేపథ్యంలో చిరుత అటు వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆ ప్రాంతాల్లో గాలిస్తామన్నారు.

News September 28, 2024

తూ.గో.: పిడుగు పడతాయి జాగ్రత్త

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కోనసీమ, కాకినాడ రూరల్, తుని, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, అనపర్తి తదితర ప్రాంతాల్లోని ప్రజల సెల్‌ఫోన్లకు సందేశాలు పంపించారు.

News September 28, 2024

రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు మండపేట విద్యార్థులు

image

రాయవరం, కాకినాడలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ ఆటల పోటీల్లో మండపేటకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14, 17 విభాగాల్లో టెన్నికాయట్ లో బల్ల సత్యనారాయణ, కే.శివశంకర్ ప్రసాద్, ఖండవల్లి చైతన్యలు ఎంపికయ్యారు.