News March 2, 2026

తూ.గో: మళ్లీ పులి కలకలం.. ట్విస్ట్ ఏంటంటే..!

image

గోకవరం మండలంలో పులి సంచరిస్తోందన్న పుకార్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో రాయవరం వద్ద పట్టుబడిన పులిని మారేడుమిల్లి అడవుల్లో విడిచిపెట్టగా, అది మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే అటవీశాఖ అధికారులు తనిఖీలు చేసి పులి జాడ లేదని స్పష్టం చేశారు. సారా వ్యాపారులు తమ అక్రమ దందాల కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు.

Similar News

News March 2, 2026

మార్కెట్ల బ్లడ్‌బాత్.. రూ.8లక్షల కోట్లు ఆవిరి

image

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1498, నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపడుతుండటంతో రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు 6శాతం, ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 5శాతం కోల్పోయాయి. డిఫెన్స్ షేర్లు పుంజుకున్నాయి.

News March 2, 2026

HPV వ్యాక్సిన్ సేఫ్ కాదా?.. కేంద్రం క్లారిటీ

image

ఫ్రీ HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ టీకా కొత్తది కాదని 2006 నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. 2022 చివరి నాటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసుల పంపిణీ జరిగిందని, అనేక స్టడీలు ఇది సురక్షితమని తేల్చాయని వెల్లడించింది. 14 ఏళ్లలోపు బాలికలకు అందించే టీకా గర్భాశయ క్యాన్సర్ నుంచి 93-100% రక్షణ కల్పిస్తుందని తెలిపింది.

News March 2, 2026

కొండగట్టు ఈవోగా వేములవాడ ఈవోకి అదనపు బాధ్యతలు

image

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వేములవాడ రాజన్న ఆలయ ఈవో ఎల్ రమాదేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీకాంత్ రావుకు మన్యంకొండకు బదిలీ కావడం.. ఆ వెంటనే ఆయన సెలవుపై వెళ్లడంతో వేములవాడ ఈవో రమాదేవికి కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.