News July 24, 2024
తూ.గో: ముద్ర రుణం.. యువతకు ప్రయోజనం
ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు ద్వారా ఎంతో మంది యువకులకు ఉపాధి లభిస్తుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,40,257 మందికి రూ.1,650.60 కోట్లు అందించారు. కాకినాడ జిల్లాలో 17,166 మందికి రూ. 282.51 కోట్లు.. కోనసీమ జిల్లాలో 24,371 మందికి రూ.229.84 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇకపై రూ.20 లక్షలు వరకు రుణం ఇస్తారు.
Similar News
News November 25, 2024
యువత భవితకు భరోసాగా నిలబడతాం: మంత్రి లోకేశ్
మంత్రి లోకేశ్‌ను కలిసే అవకాశం దక్కాలని విజయవాడ ఇంద్రకీలాద్రిని మోకాలిపై ఎక్కి అమ్మవారిని దర్శించుకున్న రామచంద్రపురం మండలం చౌడవరం వాసి సాయికృష్ణని లోకేశ్ సోమవారం కలిశారు. ‘అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. వైసీపీ అరాచక పాలనపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడిన తనను ఇబ్బందులు పెట్టారు. యువత భవితకు భరోసాగా నిలబడతానని అతనికి హామీ ఇచ్చా’ అని లోకేశ్ ‘X’లో పేర్కొన్నారు.
News November 25, 2024
ఫీజు రీయంబర్స్మెంట్ను వారికే నేరుగా వేస్తాం: కలెక్టర్
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ను విద్యా సంస్థలకే నేరుగా విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించిన మొత్తం మంజూరు చేస్తామని, దశల వారీగా బకాయిలు సైతం విడుదల చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పష్టమైన హామీనిస్తూ ఆ ప్రకటనలో తెలిపారు.
News November 25, 2024
రాజమండ్రిలో వ్యభిచారం.. యువతుల అరెస్ట్
స్పా సెంటర్ మాటున వ్యభిచారం చేయడం రాజమండ్రిలో కలకలం రేపింది. తాడితోటలో సతీశ్, లక్ష్మి బ్యూటీ సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్ టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. అక్కడ మసాజ్ చేస్తున్న ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ షాపును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.