News August 7, 2024
తూ.గో.: మురుగు కాల్వల అభివృద్ధికి రూ.9.8 కోట్లు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మురుగు కాలువల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క, తూడు తొలగింపునకు ప్రభుత్వం రూ.9.8 కోట్లు నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ద్వారా ఈ నిధులను మంజూరు చేశారు. కోనసీమ జిల్లాలో 76 పనులను రూ.7.1 కోట్లు, కాకినాడ జిల్లాలో 22 పనులను రూ.1.9 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక పనికి రూ.80 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి.
Similar News
News October 22, 2025
గోదావరి తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రాగల 24 గంటల్లో వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక మండలాల్లోని తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు, అవసరమైతే తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News October 22, 2025
అనిత సహనం కోల్పోతే పవన్‌కు గడ్డు పరిస్థితులు: మేడా

పిఠాపురంలో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించకుండా, భీమవరంలో జూదాల కోసం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం హాస్యాస్పదమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. హోం మంత్రి అనిత శాఖనే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అనిత సహనం కోల్పోతే పవన్‌కు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు.
News October 22, 2025
కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జాతీయ రహదారి 216ఏపై కడియపులంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా గాజువాక అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (26) మృతి చెందాడు. విజయవాడ నుంచి కారులో వస్తున్న కిరణ్ కుమార్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన కిరణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.