News September 21, 2024
తూ.గో.: మృత్యువులోనూ ఒక్కటై

మృత్యువులోనూ ఆ దంపతులు బంధం వీడలేదు. ఇద్దరు ఒకేసారి తనువు చాలించారు. ఈ విషాద సంఘటన ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెంలో శనివారం జరిగింది. భార్య, భర్త ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలిశెట్టి అధిచంద్రరావు (68) అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు. విషయం తెలిసిన ఆయన భార్య పోలిశెట్టి నాగవేణి(58) తీవ్ర మనస్తాపానికి గురై గంటల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News October 18, 2025
రాజమండ్రి: 20న పీజీఆర్‌ఎస్‌కు సెలవు

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాన్ని పురస్కరించుకుని జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in ద్వారా తెలియజేయవచ్చని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News October 18, 2025
రాజమండ్రి: నార్కో కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశం

తూర్పు గోదావరి జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలలో చైతన్యం పెంచి, యువత గంజాయికి దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 18, 2025
నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నిడదవోలు మండలం మునిపల్లి – కలవచర్ల మార్గంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మునిపల్లికి చెందిన అత్తిలి నాగరాజు (45) మృతి చెందాడు. కోరుపల్లి అడ్డరోడ్డు వద్ద నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు.