News March 9, 2025

తూ.గో: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఆర్ ఎస్ఐ మృతి

image

ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్‌కు చెందిన విశ్రాంత ఏఆర్‌ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్‌పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News September 18, 2025

యూరియా తగినంత ఉంది కలెక్టర్ కీర్తి

image

జిల్లాలో యూరియా కొరతపై వ్యాపించిన వదంతులను నివృత్తి చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామాన్ని సందర్శించారు. దొమ్మేరు ప్యాక్స్ వద్ద రైతులు, అధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో యూరియా తగినంత నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

News September 18, 2025

పెద్దవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన

image

ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్సలకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం తాళ్లపూడి మండలం పెద్దేవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గేదెల వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

News September 18, 2025

కలెక్టర్‌ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.